హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంపీ శంకుస్థాపన

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం ఎన్టీఆర్ కాలనీలో CSR నిధులు రూ.1.20 లక్షలతో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో ఎంపీ వల్లభనేని బాలశౌరి కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.