SRPT: అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామంలో ఎంతోకాలంగా నిర్లక్ష్యానికి గురైన ముత్యాలమ్మ గుడి నుంచి బ్రిడ్జి వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో పనులకు శ్రీకారం చుట్టగా, వార్డు సభ్యులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి చర్యలు చేపట్టిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
సీసీ రోడ్డు పనులు ప్రారంభం..


