MNCL: బీజేపీలో సీనియర్ నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు లేదని హాజీపూర్ మండల మాజీ అధ్యక్షుడు బొలిశెట్టి తిరుపతి ఆరోపించారు. సోమవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని గుర్తించకుండా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ పక్కన పెడుతున్నారని విమర్శించారు.
తెలంగాణ
‘బీజేపీలో నాయకులకు గుర్తింపు లేదు’


