హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పొన్నూరు మున్సిపాలిటీలో కసుకర్రు విలీనం రద్దు

GNTR: పొన్నూరు మున్సిపాలిటీలో కసుకర్రు గ్రామాన్ని కలుపుతూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఏపీ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కసుకర్రును గ్రామ పంచాయతీగా కొనసాగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2020లో ఇచ్చిన జీవో కింద కసుకర్రు గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపాలని చేసిన ప్రతిపాదన ఇక చెల్లదని ప్రభుత్వం స్పష్టం చేసింది.