హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇళ్ల స్థలాల పేరుతో YCP దొంగ పట్టాలు పుట్టించింది: మంత్రి

GNTR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 3 లక్షల పేదల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించామని, ఇందుకోసం రూ.7,170 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం మంగళగిరి TDP కార్యాలయంలో మాట్లాడుతూ.. జగన్ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రైవేట్ భూములను అధిక ధరలకు కొనుగోలు చేసి, తమ అనుచరులకు దొంగ పట్టాలు ఇచ్చారని ఆరోపించారు.