హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గూడూరు నుంచి మెమో రైలు రద్దు

TPT: గూడూరు జంక్షన్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రతిరోజూ విజయవాడకు బయలుదేరే మెమో రైలును రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై స్టేషన్ మాస్టర్‌ను వివరణ కోరగా, మెమో రైలు ఉదయం 10 గంటలకు బయలుదేరి నెల్లూరులో హాల్ట్ అవుతుందని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు నెల్లూరు నుంచి విజయవాడకు బయలుదేరుతుందని వివరించారు.