హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీజీఆర్ఎస్‌లో పాల్గొన్న ఎస్పీ

PPM: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ ఎస్.వి. మాధర్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆరు ఫిర్యాదులను స్వీకరించి, సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.