PPM: కురుపాం మండలం జరడ గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ గిరిజనులు సోమవారం కలెక్టర్ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక గర్భిణీలు, రోగులను డోలీల్లో తరలించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో మంజూరైన అంగన్వాడీ భవనం ఇంతవరకు నిర్మించలేదని, మంజూరైన జియో టవర్ పనులు కూడా ప్రారంభం కాలేదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జరడలో మౌలిక సదుపాయాల కొరత


