హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్మార్ట్ కిచెన్‌కు రూ.32 లక్షల విరాళం

ELR: దెందులూరులో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం స్మార్ట్ కిచెన్ కోసం 'దీపక్ నెక్స్ట్‌జెన్' సంస్థ రూ.32 లక్షల సీఎస్ఆర్ నిధులను విరాళంగా అందించింది. సోమవారం కలెక్టరేట్‌లో సంస్థ ఎండీ ఏ.వి.సుబ్రహ్మణ్యం ఈ చెక్కును కలెక్టర్ కె.వెట్రిసెల్వికి అందజేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేలా ఆధునిక వసతులతో కిచెన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.