హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రత్యేక పోలీస్ స్టేషన్ల మంజూరుపై కృతజ్ఞతలు

SRCL: సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పరశురాములు మాట్లాడుతూ.. సిరిసిల్లలో మహిళా, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు గతంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎస్పీ, డీజీపీ, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఇప్పుడు వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.