హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెమీఫైనల్‌కు బాలికల జట్టు

NGKL: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో నాగర్‌కర్నూల్ జిల్లా బాలికల జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. క్వార్టర్‌ఫైనల్‌లో ప్రత్యర్థి జట్టుపై ఘన విజయం సాధించినట్లు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి యాదయ్య తెలిపారు. జట్టు సభ్యుల ప్రతిభను క్రీడాభిమానులు, అధికారులు అభినందించారు. సెమీఫైనల్‌లోనూ గెలిచి ట్రోఫీ సాధించాలని ఆకాంక్షించారు.