హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

5 నెలల పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి: ఏఐటీయూసీ

కడప నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లకు ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, యూనిఫాం, గుర్తింపు కార్డులు కల్పించాలని నాయకులు కోరారు.