హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలపై పెద్దిరెడ్డి దిశానిర్దేశం

CTR: వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రొంపిచర్ల మండల పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. రొంపిచర్ల క్రాస్‌లోని ఓ కల్యాణ మండపంలో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పెద్దిరెడ్డి దిశానిర్దేశం చేయనున్నట్లు వెల్లడించారు.