హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టభద్రుల ఓటు నమోదుపై యూత్ కాంగ్రెస్ సమావేశం

WGL: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదు అంశంపై ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సందీప్ తదితరులు పాల్గొన్నారు.