హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బిల్లులు విడుదల చేయాలి: సీపీఎం

ASR: అరకులోయ మండలం బస్కి పంచాయతీలో పీఎం జన్మన్ ఇళ్ల బకాయి బిల్లులు వెంటనే విడుదల చేయాలని మాజీ ఎంపీటీసీ బురిడీ దశరథ్ డిమాండ్ చేశారు. గోందన గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఒక్కో ఇంటికి రూ.1.60 లక్షలు మాత్రమే చెల్లించారని, మిగిలిన బిల్లులు విడుదల చేసి ఇళ్ల నిర్మాణం పూర్తికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.