హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామసభలో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ

W.G: ఉండి మండలం అర్తమూరుగ్రామంలో సోమవారం గ్రామ సభ జరిగింది. మీ భూమి మీ హక్కు సభకు ఉండి తహసీల్దార్ మంతెన రామప్రసాద్ రాజు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చే పట్టాదార్ పాస్ పుస్తకాలు రాజముద్రతో తయారైన కొత్త పుస్తకాలు ఉచితంగా అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.