హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తహసీల్దార్‌కు ఈనాం భూ బాధితులు వినతి

జగ్గయ్యపేటలో సర్వీస్ ఈనాం భూ బాధితులు భారీ నిరసన తెలిపారు. 'సర్వీస్ ఈనాం పట్టాదారుల హక్కుల పరిరక్షణ వేదిక' ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహించి, తహసీల్దార్ శిరీషకు వినతిపత్రాలు అందజేశారు. తమ భూములకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.