హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటికే దుర్గమ్మ దసరా ప్రసాదం

VSP: విజయవాడ కనకదుర్గమ్మ దసరా ప్రసాదాన్ని భక్తులకు పోస్టు ద్వారా అందించే సదుపాయాన్ని విశాఖ పోస్టల్ శాఖ ప్రారంభించింది. భక్తులు తమ సమీపంలోని పోస్టాఫీసుల్లో రూ.116 చెల్లించి దీనిని బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ప్యాకెట్‌లో ప్రసాదంతో పాటు లడ్డూ, కుంకుమ, అమ్మవారి ఫొటోలను భక్తుల ఇంటికే చేరవేస్తారు. దసరా వేళ భక్తులకు ఇది మంచి అవకాశమని అధికారులు తెలిపారు.