హైదరాబాద్: 28°C
తెలంగాణ

24 గంటల్లో ఫెన్సింగ్ తొలగించాలి: ఎమ్మెల్యే

MDCL: కూకట్‌పల్లి భాగ్యనగర్ సొసైటీ భూముల పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మద్దతు తెలిపారు. సొసైటీ భూములకు వేసిన ఫెన్సింగ్‌ను 24 గంటల్లో తొలగించాలని, లేకపోతే తానే వచ్చి తొలగిస్తానని హెచ్చరించారు. సొసైటీకి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని, భూముల ఆక్రమణల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.