NLG: త్రిపురారం మండల పరిధిలోని రూప్ల తండాలో రెండు వర్గాల మధ్య తీవ్ర వివాదం చెలరేగి, కర్రలు, రాళ్లతో దాడులకు దిగారు. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలైయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని త్రిపురారం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
తెలంగాణ
VIDEO: దాడులకు దిగిన రెండు వర్గాలు


