హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా కబడ్డీ జట్టుకు బుట్టాయగూడెం విద్యార్థినులు

ఏలూరు సీఆర్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో జరిగిన సబ్‌ జూనియర్‌ బాలికల కబడ్డీ ఎంపికల్లో బుట్టాయగూడెంకు చెందిన ఆరుగురు విద్యార్థినులు సత్తా చాటారు. పిల్లి నాగవందన, రావూరి శరణ్య, చుక్క రుక్మిణి, పులపాకుల గాయత్రి, జాస్తి మోక్షశ్రీ, మెంటి వినీల శ్రీభవాని జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. వీరు త్వరలో నూజివీడులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.