హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కొమరోలులో 'సుభోజనం' కార్యక్రమం ప్రారంభం

ప్రకాశం: కొమరోలు మండలంలో సోమవారం కామూరి రమణారెడ్డి ఆధ్వర్యంలో సుభోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదరికంతో ఇబ్బందులు పడుతూ.. మంచానికే పరిమితమైన నిరుపేదలను గుర్తించి, వారికి రెండు పూటల భోజనాన్ని క్యారేజీల ద్వారా ఇంటి వద్దకే అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కొమరోలు మండలంలో 125 కుటుంబాలకు భోజనం అందిస్తున్నట్లు కామూరి రమణారెడ్డి తెలిపారు.