కృష్ణా: సోలార్ విద్యుత్తు వినియోగం పెంచేందుకు సింగిల్ డెస్క్ విధానంలో ప్రభుత్వం చేపట్టిన సేవా సేతు అభియాన్ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. సోమవారం అవనిగడ్డలో తమ కార్యాలయంలో సేవాసేతు అభియాన్ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ నెల 6,7,8 తేదీల్లో అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయం, చల్లపల్లిలో వికాస కేంద్రంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సోలార్ విద్యుత్తు వినియోగం పెంచడమే లక్ష్యం'


