హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాటుసారాపై ఎక్సైజ్‌ శాఖ దాడులు

NGKL: బల్మూర్‌ మండలంలోని బాణాల, కొండనాగుల, చౌటపల్లి తండాల్లో ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. 20 లీటర్ల నాటుసారా, 600 లీటర్ల బెల్లంపానకాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఏడుగురిపై కేసులు నమోదు చేసి, నలుగురిని అరెస్టు చేశారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.