హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ కోతలపై రైతుల ఆందోళన

MLG: ములుగు మండలంలో విద్యుత్ అంతరాయాలతో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని బీజేపీ మండల అధ్యక్షుడు రాయంచు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేసి వ్యవసాయానికి నిర్ణీత సమయాల్లో నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరంగా సరఫరా చేయాలని కోరారు. పంటలను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.