హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరువు సహాయక చర్యలు చేపట్టాలి: సీపీఎం

KDP: జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో రైతుల రుణమాఫీ, సబ్సిడీ విత్తనాలు, వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.