హైదరాబాద్: 28°C
తెలంగాణ

"ఇచ్చిన జీవో 93 తక్షణమే వెనక్కి తీసుకోవాలి"

NZB: తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల కోసం.. ప్రైవేట్ స్కూళ్లను మూసివేయాలంటూ ఇచ్చిన జీవో 93 తక్షణ వెనక్కి తీసుకోవాలని.. తెలంగాణ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యం డిమాండ్ చేశారు. నిజామాబాద్ ట్రస్మా ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్లలో ఉత్తమ టీచర్లకు సన్మాన కార్యక్రమం చేపట్టారు.