హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: న్యాయవాదుల రక్షణ చట్టం కోసం రిలే నిరాహార దీక్షలు

ELR: జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ.. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై దాడులను అరికట్టి, వారికి రక్షణ కల్పించేలా ప్రభుత్వం వెంటనే చట్టం తీసుకురావాలని న్యాయవాదులు కోరారు.