హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు నుంచి జారిపడి వృద్ధుడి మృతి

TPT: రేణిగుంట-పూడి రైల్వే స్టేషన్ల మధ్య మైలాపూర్ ఫుడ్ కంపెనీ సమీపంలో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. సుమారు 75 ఏళ్ల వయసున్న వ్యక్తి రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు రేణిగుంట రైల్వే జీఆర్పీ ఎస్సై మధుసూదన్‌రావును సంప్రదించాలని కోరారు.