హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంకటయ్య మృతదేహానికి డీసీ గోవిందరెడ్డి నివాళి

KDP: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని భావన నగర్‌కు చెందిన వెంకటయ్య గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ, బద్వేల్ నియోజకవర్గ ఇంఛార్జ్ డీసీ గోవిందరెడ్డి ఆయన స్వగృహానికి వెళ్లి పార్థివదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.