హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్పల్లి::దుబ్బాక పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ధర్నా

NZB: ధర్పల్లి మండలం దుబ్బాక ZPHS ప్రధానోపాధ్యాయురాలు శశికళపై ఆరోపణలు చేస్తూ  గ్రామస్తులు  పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఫర్నిచర్ విక్రయం, విద్యార్థుల పట్ల కఠినత్వం, మధ్యాహ్న భోజనంలో నాణ్యతా లోపాలు, బాత్రూంల అశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. HM తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేయడంతో పాటు ఈ సమస్యలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.