హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జల జీవన్ మిషన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: జల జీవన్ మిషన్-అమరజీవి జలధార కింద పాతపట్నం నియోజకవర్గానికి రూ.150 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. సోమవారం స్థానిక దువ్వారవీధిలో పనులకు శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, గ్రామీణ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.