WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఇంటి ముందు ఓ యువతి సోమవారం ఆందోళనకు దిగింది. ఛైర్మన్ కుమారుడు శ్రీకాంత్ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ఆరోపిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఆమెకు మద్దతుగా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యేను ఆశ్రయించినా న్యాయం జరగలేదని యువతి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: ఛైర్మన్ ఇంటి ముందు యువతి ఆందోళన


