హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిలో అధికారుల కోసం ఎదురు చూపులు

WNP: వీపనగండ్ల మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు సమయానికి హాజరుకాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలు దాటినా మండల వ్యవసాయ అధికారి డాకేశ్వర్ గౌడ్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రమ్య మాత్రమే ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. అధికారులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.