హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్

జగిత్యాల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 67 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ప్రతి అర్జీపై అధికారులు సమగ్ర విచారణ జరిపి, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.