SRCL: వీర్నపల్లి మండలం గోన్యా నాయక్ తండాకు చెందిన బట్టు రోజా మాన్య నాయక్‌కు మంజూరైన ఇందిరమ్మ ఇంటి బిల్లులు నిలిచిపోయాయి. బేస్మెంట్ బిల్లు రెండుసార్లు డిపాజిట్ కావడంతో అధికారులు హోల్డ్‌లో పెట్టారు. గోడలు, స్లాబ్ పూర్తైనా తదుపరి బిల్లులు విడుదల కాలేదు. పలుమార్లు ప్రజావాణిలో విన్నవించినా ఫలితం లేకపోవడంతో అప్పుల బాధతో పురుగు మందు డబ్బాతో నిరసన తెలిపారు.
తెలంగాణ
పురుగు మందు డబ్బాతో నిరసన


