హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన కోర్టు ఏర్పాటు చేయాలని వినతి

KMM: కల్లూరు మున్సిపల్ కార్యాలయంలో గ్రీవెన్స్ అధికారి ఇవాళ ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక న్యాయవాదులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏన్కూరు, తల్లాడ,పెనుబల్లి,ప్రజల సౌకర్యార్థం కల్లూరు పట్టణంలో నూతన కోర్టును ఏర్పాటు చేయాలని కోరారు. సత్తుపల్లి కోర్టుకు పోవాలంటే స్థానికులు 60 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తుందన్నారు.