హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : సర్పంచ్ కార్తీక్

MLG: మల్లంపల్లి మండలం మహమ్మద్ గౌస్‌పల్లి ఎంపీయూపీఎస్‌ పాఠశాలలో విద్యార్థులకు సర్పంచ్‌ పసుల కార్తీక్‌ యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని బాగా చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.