హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పాఠశాలలో అగ్ని ప్రమాదం... మహిళలకు గాయాలు

కోనసీమ: రాజోలు బాలుర ఉన్నత పాఠశాల వంటశాలలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. విద్యార్థులకు వంట చేస్తుండగా గ్యాస్ పైప్‌లైన్ లీకై ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వంటశాలలో ఉన్న ఏడుగురిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను అమలాపురం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.