హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఐక్యకూటమికి భారీ మెజారిటీ ఇవ్వాలి'

RR: తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ ఎన్నికల నేపథ్యంలో షాద్‌నగర్ పట్టణంలో TWU-SWF ఐక్యకూటమి అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. ఈ నెల 9న జరిగే ఎన్నికల్లో ఐక్యకూటమి అభ్యర్థులకు బాణం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, సంక్షేమం కోసం ఐక్యకూటమి పోరాడుతుందని తెలిపారు.