SKLM: జి.సిగడాం మండలం నడిమివలస పంచాయతీ గదబపాలెం గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణానికి ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి పరిస్థితులను అడిగి తెలుసుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గదబపాలెం సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన


