హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

VZM: గ్రామాల సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఎల్‌.కోట మండలం గొల్జాం గ్రామంలో ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.​ ఈ సందర్భంగా అమరజీవి జలధారలో భాగంగా నియోజకవర్గానికి రూ.233.49 కోట్లు కేటాయించినందుకు సీఎం, Dy.CMకి ఆమె ధన్యవాదాలు తెలిపారు.