PLD: నరసరావు పేట పోలీస్ కార్యాలయంలో మొబైల్ ఈ-ఫోరెన్సిక్ యూనిట్ వ్యాన్‌ను ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ప్రారంభించారు. నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించేందుకు ఈ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సంఘటనా స్థలాల్లో ఆధారాలను సేకరించడం, డిజిటల్ ఆధారాలను పరిశీలించడం, శాస్త్రీయ పద్ధతుల్లో దర్యాప్తు చేపట్టడంలో ఈ మొబైల్ యూనిట్ ఉపయోగపడుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మొబైల్ ఈ-ఫోరెన్సిక్ వ్యాన్’ను ప్రారంభించిన ఎస్పీ


