హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణికి అధికారులు డుమ్మా..

MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు హాజరుకాకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలు చెప్పేందుకు వచ్చిన వారికి అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజావాణి నిర్వహణ ఉద్దేశమేంటని ప్రశ్నించారు. అధికారులు స్పందించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు.