హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి: బీజేపీ

రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని స్థానిక బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మద్దూరులో ఇవాళ 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. రోడ్డు విస్తరణకు వ్యతిరేకం కాదని, బాధితులకు న్యాయం చేయాలని నాయకులు అన్నారు. నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు కొనసాగించాలని కోరారు.