హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సంతను వేరే చోటుకు మార్చాలి'

NRPT: నర్వ మండలం పాతర్‌చేడ్‌లో ప్రతి సోమవారం బస్టాండ్‌ వద్ద నిర్వహిస్తున్న వారపు సంతతో ప్రజలు, వాహనదారులు, ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు తెలిపారు. సంతను పంచాయతీ ఆవరణకు మార్చేందుకు సర్పంచ్‌, వార్డు సభ్యులు తీర్మానించినా కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తక్షణమే సంతను వేరే చోటుకు మార్చాలని డిమాండ్ చేశారు.