హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేగవంతంగా జరుగుతున్న భూముల రీ సర్వే

ములుగు జిల్లాలో భూభారతి కింద భూముల రీ సర్వే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో తొలివిడతగా రామచంద్రాపురం సహా 70 గ్రామాల్లో సర్వే చేపట్టారు. క్షేత్రస్థాయిలో అదనపు కలెక్టర్, తహసీల్దార్లు పర్యవేక్షిస్తుండగా, కలెక్టర్ ఎప్పటికప్పుడు ప్రక్రియను సమీక్షిస్తున్నారు. రైతులకు ఎలాంటి సమస్య లేకుండా రీసర్వే ఉంటుందని వెల్లడించారు.