హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రధాన రహదారిపై రైతుల ధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగారం స్టేజి వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడతూ.. కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలంటే డిమాండ్ చేశారు.