హైదరాబాద్: 28°C
తెలంగాణ

పడమటిగూడెంలో సీసీ కెమెరాల ఏర్పాటు

MHBD: నరసింహులపేట మండలంలోని పడమటిగూడెం గ్రామంలో పలుచోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ జక్కుల ఉప్పలయ్య యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా దొంగతనాలు, నేరాలు అదుపులోకి తీసుకురావడమే కాకుండా అపరిచిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంటుందన్నారు. గ్రామం ఇప్పటి నుంచి సీసీ కెమోరాల నిఘాలో ఉంటుందని తెలిపారు.