హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన'

WGL: వరంగల్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో షీ టీమ్ ఆధ్వర్యంలో సోమవారం మహిళల భద్రత, టీ-సేఫ్ యాప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీమ్ ఎస్సై రామారావు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒంటరిగా ప్రయాణించే మహిళలు టీ-సేఫ్ యాప్‌ను వినియోగించుకోవాలని, సైబర్ నేరాలపై 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.